ఏంటి.. మద్యం తాగితే రోగనిరోధక శక్తి తగ్గుతుందా..?

October 30, 2020 at 3:33 pm

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొంత మంది వివిధ రకాల పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రశ్నిస్తే మరికొంతమంది మాత్రం చిత్రవిచిత్రంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై నిజాలను బయటపెట్టారు వైద్యనిపుణులు. మద్యం సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరగడం కాదు ఎంతగానో క్షీణిస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకుంటే జబ్బుల ముప్పు పెరుగుతుందని తరచూ మద్యం తాగడం ద్వారా అన్ని కణాలు అవయవాలపై ప్రభావం చూపుతుంది అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో హానికరమైన కణాలను ప్రవేశపెట్టకుండా ఆపే కణాలను మద్యం దెబ్బతీస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం తో కరోనా వైరస్ లాంటి వైరస్ లు సులభంగా శరీరంలోకి అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఏంటి.. మద్యం తాగితే రోగనిరోధక శక్తి తగ్గుతుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts