ఇస్మార్ట్ శంకర్ రీమేక్.. గడ్డం పెంచుతున్న స్టార్ హీరో..?

October 16, 2020 at 7:00 pm

సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్శంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస ఫ్లాపులతో ఉన్న డైరెక్టర్ కి హీరోకి మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. మాస్ ఎంటర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అన్న విషయం తెలిసిందే. సినిమాలో గెటప్ పరంగా కూడా రామ్ ఎంతో డిఫరెంట్ గా కనిపించాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రీమేక్ అవుతుండగా ప్రస్తుతం ఇష్మార్ట్ శంకర్ సినిమా కూడా రీమేక్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమాలో రామ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని కోసం ప్రస్తుతం గడ్డం పెంచుకుని గెటప్ మొత్తం చేంజ్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు బాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ రీమేక్.. గడ్డం పెంచుతున్న స్టార్ హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts