మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మ‌రో విషాదం?

October 27, 2020 at 7:28 am

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవ‌ల క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నుంచి కోలుకున్న అనంత‌రం ఊపిరితిత్తుల సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరి.. చికిత్స పొందుతూ మరణించారు. ఆయ‌న మ‌ర‌ణం పార్టీ నేత‌లే కాదు.. ప్ర‌జ‌లు కూడా జీర్ణంచుకోలేక‌పోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాయిని ఇంట్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

నాయిని మృతి చెందిన ఐదు రోజులైనా గడవకముందే ఆయన భార్య అహల్య మృతి చెందారు. ఆమె వయసు 68 సంవత్సరాలు. కరోనా బారినపడిన అహల్య కోలుకున్నారు. పరీక్షల్లో ఆమెకు నెగటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది.

Nayini Ahalya passes away

ఈ క్ర‌మంలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. కాగాచ వారం రోజులు కూడా గడకముందే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మ‌రో విషాదం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts