జాతీయ స్థాయి అవార్డు అందుకున్న `ఎఫ్-‌2`!

October 21, 2020 at 12:53 pm

విక్ట‌రీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా 2019లో వ‌చ్చిన చిత్రం `ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హించారు. తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎఫ్‌ 2కు ఈ అవార్డు లభించింది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో అవార్డు సాధించిన ఏకైక తెలుగు చిత్రం ‘ఎఫ్‌ 2’ కావడం విశేషం.

కాగా, ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా హీరోయిన్ గా కనిపించగా, మెహరీన్ పిర్జాదా వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసింది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్‌ రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్‌, ఈశ్వరీ రావు వంటి వారు కీల‌క పాత్ర‌లో న‌టించారు.

జాతీయ స్థాయి అవార్డు అందుకున్న `ఎఫ్-‌2`!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts