సాహూ ప్లాప్ రేటింగ్ చూసి షాక్ అయినా ఫాన్స్ ..!?

October 29, 2020 at 5:05 pm

ప్రభాస్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగ. ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినాగాని తెగ సంబరపడిపోతారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయాడు. ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత సాహో అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటించాడు.కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని అంతగా అలరించలేదు.కానీ హిందీలో మాత్రం వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకులని కూడా అలరించింది.

అయితే ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని ఈ మధ్య ఒక టెలివిజన్ ఛానెల్ లో ప్రీమియర్‌ షో గా ప్రదర్శించారు. అయితే ఈ చిత్రం యొక్క టీ ఆర్పీ రేట్ 5.8 గా ఉంది. అయితే అదే రోజు వేరే ఛానెల్‌లో కార్తికేయ నటించిన గుణ 369 చిత్రం ప్రదర్శించబడింది. అయితే ఈ చిత్రానికి కూడా ఊహించని విధంగా టి ఆర్ పి రేట్ వచ్చింది. ఈ సినిమాకు గాను 5.9 రేటింగ్ దక్కింది. అంటే సాహో చిత్రం కన్నా గుణ 369 చిత్రం ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించింది అన్నమాట.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ,భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ సాహో సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అని అర్ధం అవుతుంది..

సాహూ ప్లాప్ రేటింగ్ చూసి షాక్ అయినా ఫాన్స్ ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts