ఫిదా బ్యూటీ కొత్త టాలెంట్.. అభిమానులు ఆశ్చర్యం..?

October 24, 2020 at 3:01 pm

ఫిదా సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది సాయి పల్లవి. ఎక్కడ అందాల ఆరబోతకు తావివ్వకుండా తన చిలిపి నవ్వుతోనే నేచురల్ బ్యూటీగా ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.

ఇటీవలే తన సినిమా షూటింగ్ లో భాగంగా ఉత్తరప్రదేశ్లో షూటింగ్లో పాల్గొంది సాయి పల్లవి. షూటింగ్ సమయంలో దొరికిన కాస్త సమయాన్ని అక్కడున్న పిల్లలతో సరదాగా గడిపింది. ఈ క్రమంలోనే పిల్లలకు సరదాగా కబుర్లు చెప్పడం తో పాటు.. పిల్లల అందరి చేతులు ఎంతో అద్భుతంగా మెహందీ తో నింపేసింది సాయి పల్లవి. ఈ ఫొటోస్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సాయి పల్లవి సరికొత్త టాలెంట్ను చూసి సమంత అనుపమ పరమేశ్వరన్ సైతం ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

ఫిదా బ్యూటీ కొత్త టాలెంట్.. అభిమానులు ఆశ్చర్యం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts