బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు సజీవ దహనం

October 23, 2020 at 5:33 pm

నేడు తమిళనాడు లోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో, అందులో పనిచేస్తున్న ఐదురుగు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇంకొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్‌ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ఈ ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు జరుపనున్నారు. తమకు రెక్కాడితేగానీ డొక్కాడదని,తమ పై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరు పర్వం అయ్యారు . తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదాలు తమిళనాడులో నిత్యకృత్యమయ్యాయి.కార్మాగారాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుని వందలాది మంది బలైపోతున్నారు.

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు సజీవ దహనం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts