బ్రేకింగ్‌: గుండెపోటుతో మాజీ ముఖ్య‌మంత్రి మృతి!

October 29, 2020 at 1:11 pm

బీజేపీ సీనియర్ నాయకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ గుండె పోటుతో క‌న్నుమూశారు. ఇవాళ తెల్ల‌వారుజామున శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బందిప‌డ్డ ఆయ‌న్ను.. హుఠాహుఠిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసను విడిచారు.

కేశూభాయ్ ప‌టేల్ వ‌య‌సు 92 సంవత్సరాలు. 1930 జూలై 24న జన్మించిన కేశూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఎదిగారు. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు మొదటి పర్యాయం, 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇటీవల సెప్టెంబరు 30న సోమనాథ్ మందిర్ ట్రస్ట్‌కు రెండవసారి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. కాగా, కేశూభాయ్ ప‌టేల్ మృతి ప‌ట్ల బీజేపీ నేత‌లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయ‌న మృతిపై ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.

బ్రేకింగ్‌: గుండెపోటుతో మాజీ ముఖ్య‌మంత్రి మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts