మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి!

October 22, 2020 at 7:03 am

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 86 సంవ‌త్స‌రాలు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు.

అనంత‌రం క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. అయితే ఇంటికి చేరిన ఆయ‌న‌కు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అయితే బుధవారం అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అహల్యా, కుమారుడు దేవేందర్‌రెడ్డి , కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రామ్ నగర్ డివిజన్ కు కార్పొరేటర్ గా పని చేస్తున్నారు. నాయిని మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts