వరద బాధితులకు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌‌?

October 20, 2020 at 8:47 am

వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి అన్ని ప్రాంతాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయింది. అయితే ఇంకా వర్ష సమస్య పోలేదని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఏపీలోని వ‌ద‌ర బాధితుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పారు.

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళాదుంపలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తీవ్ర పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ క్ర‌మంలోనే వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయానున్నాడు.

వరద బాధితులకు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts