`గబ్బర్ సింగ్`‌తో నాకు స్టార్‌డ‌మ్‌..ఆ వార్తల్లో నిజం లేదంటున్న శృతి?

October 6, 2020 at 2:30 pm

శ్రుతి హాసన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన శృతి హాస‌న్‌.. ఓ మై ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెర‌కెక్కించిన `గబ్బర్ సింగ్` చిత్రంతో స్టార్‌డ‌మ్ అందుకుంది.

ఈ చిత్రం త‌ర్వాత తెలుగు మరియు దక్షిణాది ఇండస్ట్రీకు కానీ శృతి ఎంతో విధేయతకు కట్టుబడి ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పింది. అయితే ఇటీవలే తెలుగు మరియు దక్షిణాది ఇండస్ట్రీలపై శ్రుతి హాస‌న్ త‌ప్పుగా మాట్లాడిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన శృతి.. తాను ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో తాను పేర్కొన్న అంశాన్ని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా ప్ర‌చారం చేస్తుంద‌ని ఆరోపించింది.

కానీ, ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజమూ లేదని శృతి క్లారిటీ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని శ్రుతి హాసన్ ఉద్ఘాటించారు. రేసుగుర్రం, పవన్ కల్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నానని వివరించారు. అలాంటి తెలుగు సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని శ్రుతి వెల్లడించారు.

`గబ్బర్ సింగ్`‌తో నాకు స్టార్‌డ‌మ్‌..ఆ వార్తల్లో నిజం లేదంటున్న శృతి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts