సింగ‌ర్‌పై ఎమ్మెల్యే.. అత‌ని కుమారుడి అఘాయిత్యం..

October 19, 2020 at 1:37 pm

దేశంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ది. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు చేసినా కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. అందులో ప్ర‌జాప్ర‌తినిదులు కూడా ఉండ‌డం విచారకం. బాధ్య‌త‌గ‌ల ఓ ఎమ్మెల్యే ఓ సింగ‌ర్‌ను ఇంటికి పిలిచి మ‌రీ కొడుకుతో క‌లిసి ఆమెపై అఘాయిత్యానికి తెగ‌డ‌బడ్డాడు. విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించాడు. బాధిత యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం అస‌లు విష‌యం వెలుగుచూసింది. హత్రాస్ ఘటన అనంతరం మొదలైన ఆగ్రహ జ్వాలలు చల్లారకముందే యూపీలో ఈ దారుణ విషయం వెలుగులోకి రావ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్న‌ది. అధికారులు, బాధిత మహిళ తెలిపిన క‌థ‌నం ప్రకారం.. 2014లో త‌న నివాసంలో జ‌రిగిన ఓ కార్యక్రమానికి పాల్గొనాల‌ని ఓ మహిళా సింగర్(25)ను ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా తన ఇంటికి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కుమారుడితో క‌లిసి ఆ సింగర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయంపై ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపుచి అక్కడి నుంచి పంపించారు. అటు త‌రువాత వార‌ణాసిలోని ఓ హోట‌ల్‌లోనూ ఆమెపై ఎమ్మెల్యే మ‌రోసారి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఇదిలా ఉంటే.. అయితే ఆయ‌న ఎమ్మెల్యే కావ‌డంతో ఫిర్యాదు చేసేందుకు ఇంత‌కాలం భ‌య‌ప‌డిన‌ట్లు బాధితురాలు వెల్ల‌డించింది. అయితే బీజేపీ మిత్రపక్షమైన నిషద్‌ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) నుంచి విజ‌య్ మిశ్రా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ లో ఓ భూమిని ఆక్రమించిన కేసులో ఇటీవ‌లే ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 రోజులుగా ఆయ‌న ఆగ్రా సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. ఈ విష‌యం తెలుసుకుని ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చిన‌ట్లు బాధిత మ‌హిళ వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంబించిన‌ట్లు బధోహి ఎస్పీ రామ్‌ బదన్‌ సింగ్ వెల్ల‌డించారు.

సింగ‌ర్‌పై ఎమ్మెల్యే.. అత‌ని కుమారుడి అఘాయిత్యం..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts