బాల‌య్య చిన్న‌ల్లుడికి జ‌గ‌న్ స‌ర్కార్ బిగ్ షాక్‌?

October 24, 2020 at 8:22 am

నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, గీతం యూనివర్సిటీ చైర్మన్ శ్రీ భరత్‌కు ఏపీ ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు అధికారులు గ‌ర్తించారు.

దీంతో ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రధాన ద్వారం, భద్రతా సిబ్బంది గదులు, ప్రహరీలో కొంతభాగాన్ని కూల్చివేశారు. మ‌రోవైపు ఎందుకు కూల్చుతున్నారో తమకు చెప్పడం లేదని, కూల్చివేతకు ముందు నోటీసులు కూడా ఇవ్వలేదని గీతం యాజమాన్యం పేర్కొంది.

కూల్చివేత సందర్భంగా వర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, బాల‌య్య చిన్న‌ల్లుడు శ్రీ భరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు. మ‌రి ఈ నిర్మాణాల తొలగింపుపై భరత్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

బాల‌య్య చిన్న‌ల్లుడికి జ‌గ‌న్ స‌ర్కార్ బిగ్ షాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts