ఇది విన్నారా.. అనుష్క శర్మ రషీద్ ఖాన్ భార్యనట.. ?

October 12, 2020 at 1:55 pm

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మను చాలా కాలం ప్రేమించి 2017లో ఘ‌నంగా పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న ఈ జోడీకి ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనుష్క శ‌ర్మ గురించి ఓ షాకింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. అన్నిటికి స‌మాధానం చెప్పే గూగుల్‌లో.. రషీద్ ఖాన్ వైఫ్ పేరేంట‌ని కొడితే అనుష్క శర్మ అని వస్తుంది.

అఫ్ఘాన్ క్రికెటర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్‌కి నిజానికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. మ‌రి రషీద్ ఖాన్ భార్య పేరు అడిగితే.. గూగుల్‌‌లో అనుష్క పేరు ఎందుకు వస్తోందనేగా మీ అనుమానం? అందుకు ఓ కార‌ణంగా ఉంది. 2018 లో రషీద్ ఇన్ స్టా గ్రాం లో తన అభిమానులతో చాటింగ్ చేస్తున్నప్పుడు..

మీ అభిమాన హీరోయిన్ ఎవరు..? అని అడిగారు. దానికి రషీద్ ఖాన్ స్పందిస్తూ.. అనుష్క శర్మ, ప్రీతి జింటా అని చెప్పారు. ఆ తర్వాత పలు పేపర్లు, వెబ్‌సైట్లు.. రషీద్ ఖాన్ అనుష్క శర్మ అభిమాని అని ఎక్కువగా వార్తలు ట్రెండింగ్ అయ్యాయి. అప్పటి నుంచి గూగుల్ ఇలా చూపిస్తోందట. కాగా, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్.. ఏకంగా ఆ టీం వైస్ కెప్టెన్. ప్ర‌స్తుతం ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌‌కు ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ రషీద్.. బంతిని గింగిరాలు తిప్పి వికెట్లను గిరాటేయడంలో మ‌హా దిట్ట‌.

ఇది విన్నారా.. అనుష్క శర్మ రషీద్ ఖాన్ భార్యనట.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts