అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన గుణశేఖర్…!

October 9, 2020 at 4:19 pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెట్స్ వేసే డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా మొదటగా వచ్చే సమాధానం డైరెక్టర్ గుణశేఖర్ అని. గుణశేఖర్ చివరగా రుద్రమదేవి చిత్రం డైరెక్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన కూడా ఎలాంటి ప్రాజెక్టుని ఇంకా సెట్స్ పైకి తీసుకు వెళ్ళలేదు. అయితే చాలా కాలం కిందట హిరణ్యకశ్యప్ అనే ప్రాజెక్టు ప్రకటించిన సంగతి అందరికీ విధితమే. ఇకపోతే ఈ సినిమా మైథలాజికల్ డ్రామాగా అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ కొరకు ఏకంగా 15 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాలీవుడ్ టాక్.

ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అమెరికాలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ సంస్థ వారు, ఫాక్స్ స్టార్ అనే హాలీవుడ్ స్టూడియోస్ తో కలిపి నిర్మించబోతోంది. దగ్గుబాటి రానా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి షూటింగ్ ప్రక్రియ త్వరలో మొదలు కాబోతున్నట్టుగా టాలీవుడ్ సమాచారం అందిన.. తాజాగా గుణశేఖర్ ఈ విషయంపై ఓ షాక్ ఇచ్చారు.

అదేమిటంటే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు లాక్ డౌన్ లోనే పూర్తి అయిపోయాయని అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ వెళ్లే కంటే ముందే మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు.తాను తీయబోయే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తాను ఈ రోజు సాయంత్రం 7 .11 నిమిషాలకు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే హిరణ్యకశ్యప్ సినిమా మొదలవడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టేలా ఉంది కాబోలు.

అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన గుణశేఖర్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts