బీజేపీకి కొత్త పేరు పెట్టిన హరీష్ రావు…

October 23, 2020 at 12:23 pm

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రం జరుగుతోంది. అయితే దుబ్బాకలో టీఆర్ఎస్‌ని గెలిపించే బాధ్యత మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. ఇక ప్రచారంలో హరీష్ రావు దూసుకెళుతున్నారు. ప్రత్యర్ధులపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే హరీష్ రావు, బీజేపీ-కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. పెన్షన్లపై చర్చకు రమ్మని సవాల్ విసిరిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. మోదీ ప్రధాని అయితే కోటి ఉద్యాగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ… ఈ ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్‌కు ఓటేస్తే కాలిపోయే మోటార్లను ఇస్తారని, బీజేపీకి ఓటేస్తే బాయి కాడ మీటర్లను పెడతారని హరీశ్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

బీజేపీకి కొత్త పేరు పెట్టిన హరీష్ రావు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts