హత్రాస్ ఘటన.. 50 వేలు పరిహారం..?

October 19, 2020 at 6:47 pm

హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దళిత యువతిని పంట పొలాల్లోకి లాక్కెళ్లి కొంత మంది కామాంధులు యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి దారుణంగా హింసించి హత్య చేసిన ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఈ కేసును సిబిఐకి అప్పగించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. అయితే యువతిని అత్యాచారం చేసిన పంట పొలానికి చేరుకున్న సీబీఐ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాము పూర్తి ఆధారాలు సేకరించే వరకు పంటకు నీళ్లు పెట్టడం కానీ కోయడం కానీ చేయకూడదు అంటూ ఆ పంట పొలానికి సంబంధించిన యజమానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఆ పంట పొలం యజమాని చేతికొచ్చిన పంట కోయకుండా ఎలా ఉండాలని దీనికి గాను తనకు 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

హత్రాస్ ఘటన.. 50 వేలు పరిహారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts