తనని తానే అమ్మకానికి పెట్టుకున్న వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకే!

October 3, 2020 at 9:07 am

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గానే చాలా మంది త‌మ లైఫ్ పార్ట్న‌ర్‌ను వెతికేసుకుంటున్నారు. ముఖ్యంగా డేటింగ్ యాప్‌ల‌ను నేటి త‌రం యువ‌త తెగ వినియోగిస్తున్నారు. అయితే ఓ వ్య‌క్తి గ‌త ప‌దేళ్లుగా త‌న పార్ట్న‌ర్ కోసం వెతికి వెతికి.. చివ‌ర‌కు వేసారి ఫేస్‌బుక్‌లో తనని తానే అమ్మకానికి పెట్టుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో అలెన్ క్లేటన్ (30) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా ప‌ని చేస్తున్నాడు.

అయితే అలెన్ క్లేటన్ ఒక్క అమ్మాయితోనైనా జట్టు కట్టాలని భావిస్తూ పదేళ్లుగా తనను ప్రేమించే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఫలితం లేకపోవడంతో సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌లలో గాలించ‌గా.. ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో చేసేదేమి లేక తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు. ‘నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ‘ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. తన పేరు అలెన్ అని, తనకు 30 సంవత్సరాలని పేర్కొన్నాడు.

అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. గత పదేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాను. అయితే ఒంటరిగా ఉండ‌డం తనకు ఇష్టం లేదన్నాడు. డేటింగ్ యాప్స్‌లలో అమ్మాయిల కోసం ఎదురుచూశాను కానీ త‌న‌కు అదృష్టం వరించలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశాడు. ఇక అలెన్ పోస్ట్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. అనేక మంది మ‌హిళ‌ల‌ను అల‌న్‌తో జీవిత ప్ర‌యాణం చేసేందుకు ఆస‌క్తి చూపించారు. మ‌రి వారిలో అలెన్ ఎవ‌రిని ఎంచుకుంటాడో చూడాలి.

తనని తానే అమ్మకానికి పెట్టుకున్న వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts