65 సంవత్సరల వ్యక్తి పాత్రలో హీరో నాని..!?

October 27, 2020 at 6:32 pm

తెలుగు సినీ పరిశ్రమలో ‘ అష్టా చమ్మ ‘ సినిమాతో పరిచయమైన హీరో నాని ప్రేక్షకుల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ లో “v ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే… ఈ సినిమాలో నాని మూడు పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు పాత్రలలో ఒక పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందని సమాచారం.

ఇక ఆ పాత్రలో నాని 65 సంవత్సరాల వృద్ధుడు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు సిద్ధంగా ఉండే నాని ఈ పాత్ర కెరియర్లోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుందట అని సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభమవ్వబోతుంది.

65 సంవత్సరల వ్యక్తి పాత్రలో హీరో నాని..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts