టాలీవుడ్ హీరో ఇంట్లో అందరికి కరోనా !

October 17, 2020 at 1:41 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ఇప్ప‌టికే ల‌క్ష‌ల ప్రాణాలను బ‌లితీసుకుంది. ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. ఊహించ‌ని స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఇక సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న ఇంట్లో అంద‌రికీ క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తోంది. రాజశేఖర్, భార్య జీవితా, పిల్లలు శివాని, శివాత్మిక అందరూ క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. అయితే వీరిలో శివాని, శివాత్మిక కోలుకున్నారు.

జీవిత, రాజశేఖర్‌లు మాత్రం ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజశేఖర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే తాము కూడా క‌రోనా నుంచి కోటుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు.

టాలీవుడ్ హీరో ఇంట్లో అందరికి కరోనా !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts