హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల..!

October 27, 2020 at 4:27 pm

కరోనా వైరస్ కారణంగా దేశంలోని ప్రజలు అందరు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎవరికీ వైరస్ సోకుతుందో తెలియటంలేదు.. తాజాగా మన టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖర్ కు కూడా గత రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.అయితే ఆయనతో పాటుగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు శివానీ,శివాత్మిక త్వరగానే కోలుకున్నారు. ఇంకా జీవితా రాజశేఖర్ కూడా రీసెంట్‌ కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ అని రావ‌డంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు.

అయితే హీరో రాజశేఖర్ పరిస్థితి గురించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. చికిత్స‌కు స్పందిస్తున్నారు. ప్లాస్మా థెర‌పీని కూడా అందిస్తున్నాం. ఒక ప్ర‌త్యేక వైద్య బృందం రాజశేఖర్ ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గమనిస్తున్నారు అని వైద్యులు పేర్కొన్నారు. రాజశేఖర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.. !!

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts