గ్రాండ్‌ రీ-ఎంట్రీ ఇచ్చిన శింబు.. ఖుషీలో ఫ్యాన్స్‌!

October 22, 2020 at 3:53 pm

కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈయ‌న అభిమానులు ఉన్నారు. ఇక సక్సెస్ వచ్చినా రాకపోయినా ఈ మన్మథుడు మాత్రం తన రేంజ్ ని ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంటాడు. ప్రతి సినిమాలో వీలైనంత వరకు తన స్టైల్ మార్క్ ఉండేలా చూసుకుంటాడు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు శింబు సోషల్ మీడియాలోకి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికలైన ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తిరిగి ప్రారంభించాడు. ఈయ‌న మొట్ట మొద‌టి పోస్ట్ ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. గత కొన్ని నెలలుగా చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను శింబు ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో మొద‌ట పోస్ట్ చేశారు.

కాగా, ట్విటర్, ఫేస్‌బుక్ నుంచి 2017లో శింబు వైదొలిగాడు. నెగిటివిటీ పెరిగిపోతోందనే కారణంతో అప్పట్లో సోషల్ మీడియాకు స్వస్తి పలికాడు. మ‌ళ్లీ మూడేళ్ల‌కు శింపు సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వ‌డంతో.. ఆయ‌న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

గ్రాండ్‌ రీ-ఎంట్రీ ఇచ్చిన శింబు.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts