హీరో సుమంత్ నటిస్తోన్న ‘కపటధారి’ టీజర్ విడుదల..!

October 29, 2020 at 6:20 pm

ప్రదీప్ కృష్ణమూర్తి – హీరో సుమంత్ కాంబినేషన్ లో మరోసారి తెరకెక్కబోతున్న సినిమా ‘కపటధారి’. ఈ ప్రపంచంలో ఏది ఊరికే జరగదు అన్నిటికీ ఓ కారణం ఉంటుంది అంటూ హీరో సుమంత్ తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ లో చెప్పుకొచ్చారు. ఇదంజగత్. సుబ్రహ్మణ్యపురం లాంటి వరుస విజయాలను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు కపటధారి అనే ఎమోషనల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కన్నడలో సూపర్ హిట్ అయిన `కావలుధారి` అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.

కపటధారి సినిమాను తెలుగు, తమిళ భాషలలో డాక్టర్. ధనంజయ నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు. నేడు ఈ సినిమా టీజర్ కు సంబంధించి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అన్న పాయింట్ ను బేస్ చేసుకొని కథను తెరకెక్కించినట్లుగా అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలా కనపడుతున్నాడు హీరో సుమంత్.

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/BIU6MeACPhw” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

హీరో సుమంత్ నటిస్తోన్న ‘కపటధారి’ టీజర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts