ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఎన్ని కొత్త కరోనా కేసులంటే..?!

October 21, 2020 at 6:21 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హెల్త్ బులిటెన్ పరంగా చూస్తే గడచిన 24 గంటల్లో మొత్తం 74 422 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 3746 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. దీనితో నేటికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 7,90,404 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు తాజాగా 47 39 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 32 376 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 27 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా మృతి చెందిన వారి సంఖ్య 6508 కి చేరుకుంది. ఇక తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 677 కేసులు నమోదు అవ్వగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 65 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఎన్ని కొత్త కరోనా కేసులంటే..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts