హైదరాబాద్లో కంపించిన భూమి.. జనంలో భయం భయం..?

October 22, 2020 at 5:02 pm

హైదరాబాద్ నగరాన్ని ఇటీవల వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో జనజీవనం స్తంభించిపోయింది ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్ నగర వరదల నుంచి బయటపడుతుంది. ఇలాంటి క్రమంలో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరవాసులు అందరిని భూ ప్రకంపనలు ఒక్కసారిగా హడలెత్తించాయి . హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి ఉన్నటువంటి స్వల్పంగా కనిపించినట్టు ఇటీవలే అధికారులు గుర్తించారు.

అయితే ఈ భూప్రకంపనలు పలుమార్లు వరుసగా జరిగాయని అధికారులు గుర్తించారు. వనస్థలిపురం బి.ఎన్.రెడ్డి నగర్ వైదేహి నగర్ లో గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో… దాదాపు కొన్ని సెకన్లపాటు ఇలా భూమి స్వల్పంగా కంపించిన ట్లు గుర్తించిన అధికారులు శబ్దాలతో ప్రజలందరూ హడలిపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టినట్లు తెలిపారు. ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 0.5 గా నమోదయింది అధికారులు తెలిపారు.

హైదరాబాద్లో కంపించిన భూమి.. జనంలో భయం భయం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts