కార్పొరేట‌ర్‌పై ముంపు కాల‌నీవాసు‌ల దాడి..!

October 18, 2020 at 12:47 pm

ఇంత‌కు ముందులా ప్ర‌జ‌లు లేరు. ఓట్ల‌ప్పుడు వ‌చ్చి.. ఆ త‌రువాత మొఖం చూడ‌కుండా ఉంటే చూస్తూ మౌనంగా ఏమీ ఉండ‌డం లేదు. అదును చూసి ఆ నేత‌ల చోక్కాను ప‌ట్టుకుని నిల‌దీస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ప్ర‌జాసమ‌స్య‌ల‌పై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల‌కు క‌నువిప్పు క‌లిగిస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. వ‌ర‌ద‌ల‌తో ప‌రామ‌ర్శించేందుకు కార్పొరేట‌ర్పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డారు. దాడికి కూడా చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

భారీ వ‌ర్షాల‌తో నగరంలోని పలు ప్రాంతాలు వరదలో ఉన్న విషయం తెలిసిందే. అందులో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట కూడా పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఊహించ‌ని ప‌రిణామం చేసుకుంది. స్థానికులు కార్పొరేట‌ర్‌పై తిర‌గ‌బ‌డ్డారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువ‌ల్లే త‌మ కాల‌నీ ముంపున‌కు గుర‌యింద‌ని కోపోద్రిక్తులయ్యారు. ఈ క‍్రమంలో ఓ మహిళ… కార్పోరేటర్‌ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా తిరుమ‌ల్‌రెడ్డి‌ కంగు తిన్నారు. మ‌రికొంత మంది దాడికి య‌త్నించ‌గా బీజేపీ నేత‌లు అడ్డుకుని స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కార్పొరేట‌ర్‌పై ముంపు కాల‌నీవాసు‌ల దాడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts