హైద‌రాబాద్‌లో హైటెక్ వ్య‌భిచారం.. అందరూ విదేశీవ‌నిత‌లే

October 19, 2020 at 3:02 pm

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు చేసినా.. నిఘాను ఎంత పెంచినా కొంద‌రు గుట్టుగా త‌మ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అక్ర‌మ దందాల‌ను కొన‌సాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ హైటెక్ వ్య‌భిచార ముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. ప‌ట్టుబ‌డిన వారిలో ఎక్కువ‌గా విదేశీ వ‌నితే ఉండ‌డం ఆందోల‌న క‌లిగించే అంశం. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. హైద‌రాబాద్‌కు చెందిన రుహుల్ అమిన్ ధాలి, అబ్దుల్ బారిక్ షేక్ కొంత కాలంగా మానవ అక్రమ రవాణాకు పాల్ప‌డుతున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి బంగ్లాదేశ్ కు చెందిన యువ‌తుల‌కు ఎర‌వేస్తున్నారు. త‌ప్పుడు ప‌త్రాల‌ను సృష్టించి వారిని భార‌త్‌కు తీసుకువ‌చ్చి బ‌ల‌వంతంగా వ్య‌భిచార రొంపిలోకి దింపుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసును దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆ ముఠా సభ్యులపై ఎన్ఐఎ ఎఫ్ఐఆర్ నిఘాను పెంచింది. ఈ క్ర‌మంలో గ‌తంలో ఇలాంటి కేసులోనే రుహుల్ అమిన్ ధాలిపై నిఘా పెట్ట‌గా కొత్త విష‌యాలు వెలుగు చూశాయి. పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్య‌భిచార‌దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు గుర్తించారు. అదును చూసి స్థానిక పోలీసుల‌తో క‌లిసి ఎన్ ఐఏ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఇప్పటికే సుమారు 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మంది బంగ్లా దేశ్ కు చెందిన వారుకాగా, మిగిలినవారు స్థానికులే అని గుర్తించారు. దీంతో నిందితులపై ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ నుండి హైద్రాబాద్ తో పాటు ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలకు పలువురు విదేశీ యువతులకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పశ్చిమబెంగాల్ లోని కలకత్తా మీదుగా హైద్రాబాద్ తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. విదేశీ వ‌నీత‌ల‌ను స్టేట్ వెల్ ఫేర్ హోమ్స్ లో ఉంచారు.

హైద‌రాబాద్‌లో హైటెక్ వ్య‌భిచారం.. అందరూ విదేశీవ‌నిత‌లే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts