ఏపీ లో కొనసాగుతున్న కరోనా కేసులు.. నేడు కొత్తగా 6,242 కేసులు…!

October 4, 2020 at 7:26 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గినట్టుగా కనిపించినా కానీ, ప్రతిరోజు వేల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైద్య అధికారులు, అలాగే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా చివరికి మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులు సంఖ్యను మీడియా బులిటెన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,94,206 శాంపిల్స్ ను వైద్యాధికారులు పరీక్షించారు.

ఇక గడచిన 24 గంటల్లో 72,811 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 6,242 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,16,341 కి చేరుకొంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 7084 మంది కోవిడ్ బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 6,58,875 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 54,400 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఇక నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 5981 కి చేరుకుంది.

ఏపీ లో కొనసాగుతున్న కరోనా కేసులు.. నేడు కొత్తగా 6,242 కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts