ఏపీలో కొనసాగుతున్న కరోనా.. నేడు కొత్తగా 2905 కేసులు..!

October 29, 2020 at 6:57 pm

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం తాజాగా గడిచిన 24 గంటల్లో 88 ,778 మందికి శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 2905 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో నేటి వరకు 8,14 ,784 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 3 ,243 మంది కరోనా నుండి కోలుకొని ఛోస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 16 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 6 ,659 కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొనసాగుతున్న కరోనా.. నేడు కొత్తగా 2905 కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts