భారత్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా షెడ్యూల్ వ‌చ్చేసింది..!

October 28, 2020 at 9:35 am

ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు ఈ సిరీస్‌లో పూర్తిగా రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఇక మూడు నెలల పాటు జరిగే ఈ పర్యటనలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌ల్లో తలపడనుంది.

అయితే తాజాగా సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విడుదల చేసింది. ఐసీఎల్ ముగిసిన త‌ర్వాత‌.. భార‌త జ‌ట్టు నేరుగా యూఏఈ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో ఆస్ట్రేలియాకి వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌‌లో ఉండి తర్వాత సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్నారు. ఇక షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

తొలి వన్డే నవంబరు 27న సిడ్నీలో, రెండో వన్డే నవంబరు 29న సిడ్నీలో మ‌రియు మూడో వన్డే డిసెంబరు 1న మనూక ఓవెల్ లో జ‌ర‌గనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4న మనూక ఓవెల్ లో, రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6న సిడ్నీలో మ‌రియు మూడో టీ20 మ్యాచ్ డిసెంబరు 8న సిడ్నీలో జ‌ర‌గ‌నున్నాయి.

తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న అడిలైడ్ ఓవెల్ లో(డే/నైట్ టెస్టు) రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26న మెల్‌బోర్న్ లో, మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7న సిడ్నీలో మ‌రియు నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15న గబ్బాలో జ‌ర‌గ‌నున్నాయి.

భారత్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా షెడ్యూల్ వ‌చ్చేసింది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts