పండగ సమయంలో ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే…

October 22, 2020 at 1:48 pm

కరోనా నేపథ్యంలో పలు స్పెషల్ రైళ్లు మాత్రమే నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో మరిన్ని రైళ్లు పలు మార్గాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది.

ఇందులో భాగంగా ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను నవంబరు 10 వరకు రూ. 50 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్‌ లేని ప్రయాణికులు రైళ్లను ఎక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే స్టేషన్‌కు అనవసరంగా వచ్చే ప్రయాణికులను నియంత్రించేందుకే  ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచుతున్నామని తెలిపారు. అయితే పండుగల వేళ ప్రత్యేక రైళ్ల సంచారం ప్రారంభం కావడంతో రైల్వేస్టేషన్‌లలో రిజర్వేషన్‌ టికెట్లు ఖరారు కానివారిని నియంత్రించే దిశలో రైల్వే శాఖ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

పండగ సమయంలో ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts