వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో అవార్డు సొంతం చేసుకున్న భారతీయ వనిత

October 18, 2020 at 5:09 pm

ఇటీవల భారత దేశానికి చెందిన ఐశ్వర్య శ్రీధర్ అనే యువతి ” వైల్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్” అవార్డును సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల ఎంట్రీలు జరగగా.. అందులో ఐశ్వర్య తీసిన ఫోటో కూడా నిలిచింది. చివరికి అన్ని ఎంట్రీలలో 100 ఫొటోలను ఎంపిక చేయగా అందులో ‘అకశేరుకాల ప్రవర్తన’ అనే కేటగిరీలో ఐశ్వర్య అవార్డును సొంతం చేసుకుంది.

ఇక లండన్ లో నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐశ్వర్య శ్రీధర్ ప్రకటించారు. ఇక తాను తీసిన ఫోటో ఐశ్వర్య ‘లైట్స్ ఆఫ్ పాషన్’ అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా యువ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా తనకు, భారత్ కు ఇది ఎంతగానో గర్వకారణం అని కొనియాడారు. అడల్ట్ కేటగిరిలో మన భారతదేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న తొలి యువ ఫోటోగ్రాఫర్ నేనే అని ఆమె తెలియజేసింది. అవార్డు సొంతం చేసుకున్న సందర్భంగా జ్యూరీలు, డబ్ల్యూపీవై బృందానికి ఐశ్వర్య కృతజ్ఞతలు తెలియ చేసింది.

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో అవార్డు సొంతం చేసుకున్న భారతీయ వనిత
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts