ఇంటరెస్టింగ్ సర్వే: విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేది ఎవరంటే?

October 16, 2020 at 10:55 am

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో అందరి దృష్టి ఉన్న, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. అయితే తెలంగాణలో జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు పెట్టబోతున్న తరుణంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

ఇక వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం. ఈ క్రమంలోనే విశాఖ కార్పొరేషన్‌లో ఏ పార్టీ సత్తా చాటుతుందనే విషయంపై తాజాగా వి‌డి‌పి అసోసియేట్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికార వైసీపీ దుమ్ములేపుతుందని తేలింది. మొత్తం 98 సీట్లలో వైఎస్సార్‌సీపీకి 84-89 వరకు వస్తాయని.. టీడీపీకి 8-14 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. మిగిలిన పార్టీలు నామమాత్రమే అని తెలిసింది. అలాగే జి‌వి‌ఎం‌సి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 49.8 శాతం.. టీడీపీకి 36.5 శాతం.. ఇతరులు, ఇండిపెండెట్లకు 5.1 శాతం.. జనసేనకు 4.1 శాతం.. బీజేపీకి 2.8శాతం, కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది.

ఇంటరెస్టింగ్ సర్వే: విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటేది ఎవరంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts