ఐపీఎల్ 2020: ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ!

October 26, 2020 at 9:10 am

ఐపీఎల్ 2020 కీలక దశకు చేరిన వేళ.. ప్లేఆఫ్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. నవంబరు 3 వరకూ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. ఒక్క రోజు గ్యాప్‌తో నవంబరు 5 నుంచి ప్లేఆఫ్ మ్యా‌చ్‌లు జరగనున్నట్టు తాజాగా బీసీస ప్ర‌క‌టించింది. నవంబర్ 5 నుంచి నవంబర్ 10 వరకు ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కు వెళతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల‌కు ప్రస్తుత సీజన్ లో ఉన్న మూడు స్టేడియాల్లో షార్జాను వదిలేసి, దుబాయ్, అబూదాబి స్టేడియాలను మాత్రమే బీసీసీఐ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ నవంబర్ 5న జరగనుంది.

టాప్ 3, 4 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ 6వ తేదీన జరుగుతుంది. ఆ తరువాత 8వ తేదీన క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు తలపడతాయి. ఇక, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2లలో విజయం సాధించిన జట్ల మధ్య నవంబర్ 10వ తేదీన దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. ఈ అన్ని మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 ప్రారంభం కానున్నాయి.

ఐపీఎల్ 2020: ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts