ఐపీఎల్ లో కొత్త సెంటిమెంట్.. టాస్ గెలిస్తే ఓటమి..?

October 21, 2020 at 5:40 pm

మామూలుగా క్రికెట్ టోర్నీ జరిగినప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ ఆటగాళ్లను వెంటాడుతూ ఉంటుంది అని క్రికెట్ ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. ఇక ఈ ఏడాది యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్లో… ఆటగాళ్లను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ టాస్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. మామూలుగా క్రికెట్ మ్యాచ్ కి టాస్ ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన వారు వాతావరణ పరిస్థితులను జట్టు బలాన్ని అంచనా వేసుకుని కీలక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇక ఇలా టాస్ గెలవటం జట్టుకు ప్లస్ పాయింట్ అవుతుంది. తమ జట్టు సామర్థ్యాన్ని బట్టి ఆడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ల అంచనాలు పూర్తిగాబెడిసి కొడుతూ చివరికి ఓటమి పాలవుతున్నారు. ఐపీఎల్ సీజన్ లో ఏకంగా టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా పరాజయాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన ఎంతోమంది కెప్టెన్లు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. యూఏఈ లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేయలేక చివరికి మ్యాచ్ పై కెప్టెన్ నిర్ణయం ప్రభావం చూపలేక పోతున్నట్లు విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

ఐపీఎల్ లో కొత్త సెంటిమెంట్.. టాస్ గెలిస్తే ఓటమి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts