హైపర్ ఆదికి కరోనా.. ఆందోళ‌న‌లో అభిమానులు?

October 23, 2020 at 11:04 am

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్పులు పెడుతోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంద‌రో ప్రాణాలు కూడా కోల్పోయారు. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సౌతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు హైప‌ర్ ఆదికి క‌రోనా సోకిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే సుడిగాలి సుధీర్, యాంక‌ర్ ర‌ష్మికి కరోనా సోకినట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే సుధీర్ కంటే ముందే హైపర్ ఆది క‌రోనా బారిన ప‌డ్డాల‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని టాక్‌. అయితే ఈ ప్ర‌చారంపై ఇప్ప‌టి వ‌ర‌కు హైప‌ర్ ఆది స్పందించ‌క‌పోవ‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, దసరా పండుగ సందర్భంగా ఇటీవల అన్ని టీవీ ఛానెళ్లు భారీ కార్యక్రమాలు రూపొందించాయి. కొందరు జబర్దస్త్ ఆర్టిస్తులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో టీవీ నటులందరికీ ఇప్పుడు క‌రోనా భ‌యం వెంటాడుతోంది.

హైపర్ ఆదికి కరోనా.. ఆందోళ‌న‌లో అభిమానులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts