సుడిగాలి సుధీర్‌కు కరోనా.. వాళ్లంద‌రికీ టెన్ష‌న్ టెన్ష‌న్‌?

October 21, 2020 at 9:20 am

ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా ఇప్ప‌టికే ప‌ద‌కొండు ల‌క్ష‌ల‌కు పైగా మందిని బ‌లితీసుకుంది. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారులు ఇలా అంద‌రిపై క‌రోనా ప్ర‌భావం చూపిస్తోంది.

అయితే తాజాగా బుల్లితెర‌ను త‌న‌దైన కామెడీతో ఏలేస్తున్న సుడిగాలి సుధీర్‌కు క‌రోనా సోకిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అక్టోబ‌ర్ 18న అత‌డికి క‌రోనా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సుధీర్ హోమ్ క్వారంటైన్‌లో సేఫ్ గానే ఉన్నారని ఫిలింనగర్ టాక్. కానీ, సుధీర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

మ‌రోవైపు సుధీర్‌కు కరోనా సోకిన‌ట్టు వార్త‌లు రావ‌డంతో.. ఆయ‌న అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే ఒక‌వేళ నిజంగానే సుధీర్‌కు క‌రోనా సోకిన‌ట్టు అయితే.. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న పాల్గొన్న షూటింగ్స్ యూనిట్ స‌భ్యులు అంద‌రికీ టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. ముఖ్యంగా సుధీర్‌తో ఎక్కువ‌గా ఉండే రామ్ ప్రసాద్, శ్రీను మ‌రియు ర‌ష్మి గౌత‌మ్‌లు ఖ‌ఛ్చితంగా క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది.

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. వాళ్లంద‌రికీ టెన్ష‌న్ టెన్ష‌న్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts