ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ వీడనున్న రోహిత్ శర్మ?

October 27, 2020 at 10:35 am

ఇండియ‌న్ ప్రీమియ‌ల్ లీగ్ (ఐపీఎల్) 2020 కీల‌క ద‌శ‌కు చేరుకుంది. మ‌రికొన్ని రోజుల్లోనే టాప్-4 జ‌ట్లుకు ప్లేఆఫ్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే బీసీసీఐ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇలాంటి స‌మ‌యంలో అగ్ర స్థానంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు షాక్ త‌గిల‌న‌ట్టు తెలుస్తోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు ఎంపిక కాకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 28న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఈ క్ర‌మంలోనే గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై తరపున రోహిత్ బరిలోకి దిగలేదు. దాంతో.. గ‌త రెండు మ్యాచుల్లోనూ కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్ ముంబయి ఇండియన్స్ టీమ్‌‌ని నడిపించాడు.

తర్వాత మ్యాచ్‌కి రోహిత్‌ వచ్చేస్తాడని కీరన్ పొలార్డ్ వెల్ల‌డించారు. కానీ, రోహిత్ రాలేదు. ఇక తాజాగా ఆస్ట్రేలియా‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం ప్రకటించిన ఏ జట్టులోనూ రోహిత్ శర్మకి చోటు దక్కలేదు. దాంతో.. రోహిత్ శర్మ గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోతే ముంబై ఇండియన్స్ షాక్ త‌ప్ప‌ద‌ని చెప్పాలి. చెప్పాలి

ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ వీడనున్న రోహిత్ శర్మ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts