జగన్ అప్పుడు ఊర్లు తిరిగారు.. కానీ ఇప్పుడు..?

October 23, 2020 at 2:26 pm

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పంట నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంట బాగా పండింది అనే ఆనందంలో ఉన్న రైతులకు మరోసారి అతి భారీ వర్షాల కారణంగా నిరాశ మిగిలింది అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవలే భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నారా లోకేష్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశనగ పంటను చూస్తే తనకు ఎంతో బాధ కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించి నారా లోకేష్.. ప్రభుత్వం పంట నష్టంపై అసలు స్పందించదా అంటూ ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ రైతులకు కష్టం వచ్చినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు అంటూ వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

జగన్ అప్పుడు ఊర్లు తిరిగారు.. కానీ ఇప్పుడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts