జగన్.. జేబులు గుల్ల చేస్తున్నారు..?

October 22, 2020 at 4:52 pm

ఇటీవలే జగన్ సర్కార్ ట్రాఫిక్ చలాన్ ల పై కీలక నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా ట్రాఫిక్ చలాన్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇక భారీగా ట్రాఫిక్ చలాన్లు ఉండడంతో వాహనదారులు అందరికీ భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారు ట్రాఫిక్ చలాన్ ఒక్కసారిగా పెంచడం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై స్పందించిన టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు జరిమానాలు విపరీతంగా పెంచి రోడ్లపై ప్రయాణించే వాహనదారుల జేబులకు గుల్ల చేస్తున్నారని విమర్శించారు అచ్చెన్నాయుడు. వాహన మిత్ర పేరుతో సంక్షేమ పథకం ద్వారా వాహనదారులకు సహాయం అందిస్తున్నాము అని చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ప్రస్తుతం జరిమానాలను విపరీతంగా పెంచి ఆ సొమ్మును మళ్లీ వసూలు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో వసూలు చేయడమే జగన్ ప్లాన్ అంటూ విమర్శించారు అచ్చన్నాయుడు. గత 16 నెలల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు కానీ జరిమానాలు మాత్రం భారీగా విధించారు అంటూ ఎద్దేవా చేశారు.

జగన్.. జేబులు గుల్ల చేస్తున్నారు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts