
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కొరకరాని కొయ్యగా మారుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని తెరమీదకు తెచ్చి జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైయస్సార్ బీమా పథకం పై విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పథకానికి ప్రస్తుతం పేరు మార్చి వైయస్సార్ బీమా పథకం తీసుకువచ్చారు అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎన్నో నిధులు ఇస్తున్నప్పటికీ ఎక్కడ ఏ పథకంలో కూడా ప్రధాని పేరు రావడం లేదు అంటూ ఆరోపించిన రఘురామకృష్ణంరాజు… ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా జగన్ సర్కారు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు రఘురామకృష్ణంరాజు.