ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

October 6, 2020 at 11:50 am

క‌రోనా విప‌త్తు స‌మ‌యంలోనూ ఏపీ స‌ర్కార్ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను వెచ్చిస్తున్న‌ది. సీఎం జ‌గ‌న్ కీల‌క ‌నిర్ణ‌యాల‌ను అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నారు. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాల్లో భాగంగా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను చేప‌ట్టిన ఆయ‌న తాజా మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణాల మాదిరిగా పల్లెల్లోనూ ఇంటింటికీ మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందు కోసం రూ. 4,800.59 కోట్ల విడుదల చేస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు.

గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారుల లెక్కల ప్రకారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 నివాస గృహాలు ఉండ‌గా, వాటిలో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. మిగ‌తా 57,52,445 ఇళ్లకు ఇప్పుడు నూతన కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున‌నారు. అందుకోసం రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన జలజీవన మిషన్‌ పథకం ద్వారా 50% నిధుల రాష్ట్రానికి రానున్నాయి. ఈ పథకం తొలి దశలో భాగంగా రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టి ఇంటింటికీ నీళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ఆ ప‌థ‌కం స్ఫూర్తితోనే కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌కు శ్రీ‌కారం చుట్ట‌డం గ‌మ‌నార్హం.

ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts