ఆక‌ట్టుకుంటున్న ఎన్టీఆర్ `బీ ఫిజ్` యాడ్.. మీరు చూశారా?

October 17, 2020 at 12:27 pm

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న ‌సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు ఐదారు నెల‌ల నుంచి ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభమైంది. ఇక క‌రోనా భ‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో పాటు ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొన‌డం విశేషం.

భారత్ లో విశేష ప్రజాదరణ పొందిన శీతలపానీయం ఫిజ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. తాజాగా ‘బీ ఫిజ్’ పేరిట కొత్త ఉత్పత్తి వచ్చింది. ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన సరికొత్త యాడ్ లో ఎన్టీఆర్ ద‌ర్శ‌న‌మించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ఈ యాడ్ లో మరింత ఉత్సాహంగా కనిపించారు. తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. `ఇంట్రడ్యూసింగ్ బీ ఫిజ్… బీ ద ఫిజ్` అంటూ డైలాగ్ చెప్పారు. తాజాగా ఈ బీ ఫిజ్ యాడ్‌ను ఎన్టీఆర్ పోస్ట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఇది నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

 

ఆక‌ట్టుకుంటున్న ఎన్టీఆర్ `బీ ఫిజ్` యాడ్.. మీరు చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts