కాబోయే భ‌ర్త‌తో క్రేజీ రికార్డ్ సృష్టించిన కాజ‌ల్‌!

October 27, 2020 at 3:05 pm

టాలీవుడ్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో అక్టోబ‌ర్ 30న కాజ‌ల్ వివాహం జ‌ర‌గ‌బోతోంది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఇక కాజల్ పెళ్లి అని తెలియడంతో సినీ స్టార్స్, అభిమానులు ఆమెకి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పెళ్లికి ముందే కాబోయే భ‌ర్త‌తో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది కాజ‌ల్‌. ఇటీవ‌ల కాబోయే భర్త గౌతమ్‌తో కలిసి ఉన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కాజల్‌-గౌతమ్‌లు ఒకేరంగు దుస్తులు ధరించి అంద‌గా చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తారు. ఈ ఫొటోలు అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఆ ఫోటోలు కాస్త వైర‌ల్‌గా మారాయి. అయితే ఇప్పుడు ఆ ఫొటోల‌కు ఏకంగా 1 మిలియన్‌కు పైగా లైక్స్ వచ్చాయి. ఒక ఫొటోకు 10,81,955 లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అది కూడా ఓ రికార్డే. ఒక్క ఫోటోకు అన్ని లైక్స్ రావడంతో కాజల్ ఫాలోయింగ్ ఏంటనేది మరోసారి ప్రూవ్ అయింది. మ‌రి కాజ‌ల్ పెళ్లి ఫొటోలు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

కాబోయే భ‌ర్త‌తో క్రేజీ రికార్డ్ సృష్టించిన కాజ‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts