వైరల్ ఫొటోస్: పెళ్లి వేడుకలలో చందమామలా కాజల్ అగర్వాల్..!

October 29, 2020 at 6:47 pm

కాజల్ అగర్వాల్.. మరికొద్ది గంటల్లో తన బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పేసి తాను ప్రేమించిన వ్యక్తితో ఏడు అడుగులు వేయబోతుంది. అక్టోబర్ 30వ తారీఖున అనగా శుక్రవారం రోజు వీరిద్దరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరుగుతోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పూర్తి సన్నాహాలు పూర్తయ్యాయి. ముంబై నగరంలో ఉన్న కాజల్ ఇంట్లో మెహందీ ఫంక్షన్ తో పెళ్లి హడావిడి మొదలైనట్లు అయింది. మెహందీ వేడుక తర్వాత హల్ది వేడుకలను కూడా నిర్వహించినట్లు తాజాగా విడుదల చేసిన ఫోటోలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా విడుదల చేసిన ఫోటోలలో కాజల్ కు పెళ్లి కల కొట్టేచేలా కనబడుతోంది. ఈ ఫోటోలో కాజల్ పసుపు రంగు చుడీదార్ వేసుకుని కనబడింది. అంతే కాదు ఆ ఫోటో లో డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించింది. కాజల్ ఇంట్లో పెళ్లి కూతురు సంబంధించిన కార్యక్రమాలు చక చక జరుగుతుంటే మరో పక్క పెళ్లి కొడుకు గౌతమ్ కిచ్లు ఇంట్లో కూడా వారి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. పూర్తిగా కుటుంబ సభ్యులు సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కాజల్, గౌతం కలిసి ఓ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారు.

వైరల్ ఫొటోస్: పెళ్లి వేడుకలలో చందమామలా కాజల్ అగర్వాల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts