కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించి ఈ విష‌యాలు తెలుసా?

October 6, 2020 at 10:32 am

కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. వ‌య‌సు 30 దాటినా కూడా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స్టార్ హీరోయిన్.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఆమె పెళ్లి నిశ్చ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన కాజ‌ల్‌.. ఏమీ చెప్పకుండా ఏమీ రాయకుండా కేవలం లవ్ సింబల్ పెట్టింది. దీంతో ఆమె పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టు క‌న్ఫామ్ అయింది.

గతంలో హీరో రానా వివాహానికి సేవలందించిన ‘వెడ్డింగ్ సూత్ర’ కంపెనీ కాజ‌ల్ పెళ్లి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందని కూడా తెలుస్తోంది. ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కాజ‌ల్‌ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత హిందీ చిత్రసీమ అడ్డా ముంబైలో జరగనున్న తొలి సెలబ్రిటీ వివాహం కాజల్‌దేనని అంటున్నారు. మూడు రోజుల పాటు కాజ‌ల్ పెళ్లి వేడుకలు ఘనంగా జ‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

అయితే కాజల్ పెళ్లి ఫిక్స్ అయింద‌ని వార్త‌లు రావ‌డంతో.. ఆమె కాబోయే భర్త గౌతమ్ కిచ్లూ గురించి నెట్టింట్లో వెత‌క‌డం షూరూ చేశారు అభిమానులు. అయితే ఇంటి అలంకరణ, టెక్ డిజైన్ సేవలందిస్తున్న ‘డిసర్న్ లివింగ్’ అనే కంపెనీ వ్యవస్థాపకుడు గౌత‌మ్‌. ఈ సంస్థకు ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక గౌతమ్ క్యాథడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ తో పాటు టఫ్ట్స్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రత్యేక కోర్సులను నేర్చుకున్న తరువాత, సొంత కంపెనీని పెట్టి రాణిస్తున్నారు.

కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించి ఈ విష‌యాలు తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts