మెహందీ వేడుక‌లో మెరిసిపోతున్న కాజ‌ల్‌.. ఫొటో వైర‌ల్‌!

October 29, 2020 at 10:36 am

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రి కొన్ని గంట‌ల్లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపార వేత్త, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో అక్టోబ‌ర్ 30న అంటే రేపే కాజ‌ల్ వివాహం జ‌ర‌గ‌బోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఇంట్లోనే కాజ‌ల్ వివాహం జ‌ర‌గ‌బోతోంది.

ఇప్ప‌టికే కాజ‌ల్ పెళ్ళి ప‌నులన్నీ పూర్తి కాగా, ఈ రోజు సంగీత్ వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక‌ బుధ‌వారం రోజు జ‌రిగిన మెహందీ వేడుక‌లో దిగిన ఫోటోని కాజ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలో త‌న చేతికి పెట్టుకున్న మెహందీని చూపిస్తూ మెరిసిపోతోంది కాజ‌ల్‌.

ప్ర‌స్తుతం కాజ‌ల్ షేర్ చేసిన ఫొటో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఇక కాజ‌ల్ వివాహ వేడ‌క‌కు క‌రోనా కార‌ణంగా అత్యంత సన్నిహుతులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. కాగా, కాజ‌ల్ కాబోయే భ‌ర్త గౌత‌మ్ ప్రస్తుతం డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను స్థాపించి నడుపుతున్నారు.

 

మెహందీ వేడుక‌లో మెరిసిపోతున్న కాజ‌ల్‌.. ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts