పెళ్లికి ముందే భ‌ర్త‌తో కాజ‌ల్ సంద‌డి.. నెట్టింట్లో ఫొటో వైర‌ల్‌!

October 26, 2020 at 12:56 pm

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్‌ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజ‌ల్ వివాహం చేసుకోబోతుంది. ఈ విషయాన్ని కాజల్ ఇటీవ‌ల స్వ‌యంగా వెల్లడించింది. అక్టోబర్ 30న ముంబైలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లాడనున్నట్టు కాజల్‌ అధికారికంగా తెలిపింది.

ఇక పెళ్లిన త‌ర్వాత కూడా న‌ట‌న కొన‌సాగిస్తాన‌ని.. ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాన‌ని ఓ క్లారిటీ ఇచ్చింది కాజ‌ల్‌. ఇదిలా ఉంటే.. దసరా సందర్భంగా తన అభిమానులకు కాజల్ పెళ్లికి ముందే ఓ స్పెషల్ గిఫ్ట్ అందించింది. తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కాబోయే భర్త గౌతమ్‌తో కలిసి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ఫొటోలో కాజల్‌-గౌతమ్‌లు ఒకేరంగు దుస్తులు ధరించి చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో అభిమానుల‌ను ఆక‌ట్టుకాగా.. నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ క‌పుల్‌, చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

పెళ్లికి ముందే భ‌ర్త‌తో కాజ‌ల్ సంద‌డి.. నెట్టింట్లో ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts