పెళ్లి డేట్ ఆఫీసియల్ గా అనౌన్స్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్

October 6, 2020 at 12:37 pm

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎట్ట‌కేలకు త‌న పెళ్లి విష‌యంపై స్పందిస్తూ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గ‌త కొద్ది రోజులుగా కాజల్ వివాహం ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో నిశ్చయమైందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమ‌ని.. ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ న‌డించింది.

అయితే దీనిపై స్పందించిన కాజ‌ల్‌.. `నేను ఎస్ చెప్పాను. అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానని మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మేము ఇద్దరం కలిసి కొత్త జీవితాలను ప్రారంభించబోతుండటం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నా.

ఇన్నేళ్ళుగా మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఇంకా అలరిస్తూనే ఉంటాను` అని కాజల్ పేర్కొంది. దీంతో కాజల్ – గౌతమ్ ల జంట చూడముచ్చటగా ఉందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. కాగా, గతంలో హీరో రానా వివాహానికి సేవలందించిన ‘వెడ్డింగ్ సూత్ర’ కంపెనీ కాజ‌ల్ పెళ్లి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందని కూడా తెలుస్తోంది.

 

పెళ్లి డేట్ ఆఫీసియల్ గా అనౌన్స్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts