కాంచన హిందీ రీమేక్ లక్ష్మీబాంబ్ టైటిల్ మార్పు..?

October 29, 2020 at 6:14 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ సినిమా గా వచ్చిన కాంచన సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాని రాఘవ లారెన్స్ హిందీలో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఓటిటి వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది ఈ సినిమా. సినిమాలో కీలక పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ బాంబ్ అనే సినిమా టైటిల్ మార్చాలని చిత్రయూనిట్ భావిస్తోందట. పేరులోనే బాంబ్ తీసేసి కేవలం లక్ష్మీ అనే టైటిల్ ఖరారు చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా వచ్చే నెల 9వ తేదీన ఈ సినిమా ఓటిటి వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

కాంచన హిందీ రీమేక్ లక్ష్మీబాంబ్ టైటిల్ మార్పు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts